జనం న్యూస్ 25 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద గురువారం నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ…జిల్లాలో వేలాది మంది కార్మికులు భవన నిర్మాణరంగంపై ఆధారపడి ఉన్నారని, సంక్షేమ బోర్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.