జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మంచిర్యాలలోనీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మి ప్రసన్న శుక్రవారం ఉదయం చనిపోయినా అధికారులు స్పందించడం లేదని, ఆమె మృతిపై అనేక నుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసిన అధికారులు స్పందించడం లేదని వారు పేర్కొన్నారు.ఆమె మృతిపై విచారణ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలో నీ జేత్వాన్ బుద్ద విహార్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు డిమాండ్ చేశారు.ఆమె అస్వస్థతకు గురైన వెంటనే సంభంధించిన అధికారులు సకాలంలో స్పందించలేదని,వెంటనే అధికలు స్పందించి ఉంటే లక్ష్మి ప్రసన్న బ్రతికేదని వారు పేర్కొన్నారు.అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోయిందని,ఎస్సి వసతి గృహాల్లో గాని,గురుకుల పాఠశాలల్లో సరియగు వసతులు కల్పించడంలో అధికారులు విఫలం చెందడంతో ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి వారు అన్నారు.దళిత అమ్మాయిల పట్ల అధిలారు నిర్లక్షం వీడి సరైన వసతులు కల్పించక పోవడం వల్ల విద్యార్థినులు బలి అవుతున్నారని,గతంలో వాంకిడి మండల కేంద్రంలో నీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల లో సైతం ఇలాంటి మరణాలు సంభవించాయని, ఆది మరచిపోక ముందే ఈ రోజు మంచిర్యాల సాంఘిక సంక్షేమ శాఖ గురుకులలో డిగ్రీ కళాశాల విద్యార్థి మరణించడం అధికారుల నిర్లక్ష్యాన్ని నిదర్శనమని వారు పేర్కొన్నారు.నిరుపేద లక్ష్మి ప్రసన్న కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కార్, ఆర్గనైజర్ విజయ్ ఉప్రే , ఎస్ ఎస్ డి, బాధ్యులు దుర్గం సందీప్,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దుర్గం మనోజ్ (చింటూ),ఉప్రె.రోషన్,సురేందర్,రమేష్, జైపాల్, స్వాగథ్ ,ఛంద్రమని,
ప్రశాంత్,ప్రకాష్,మారుతి తదితరులు పాల్గొన్నారు.