తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ జిల్లా కమిటీ సమావేశం..
జనం న్యూస్ // ఏప్రిల్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని విస్ డమ్ కాలేజీలో శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ జిల్లా కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ జిల్లా కమిటీ సమావేశంకు వచ్చిన రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం రాష్ట్ర కో కన్వీనర్ గొల్లూరు ప్రవీణ్ కుమార్ లు హాజరైనారు. రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం మాట్లాడుతూ ప్రజాస్వామ్య తెలంగాణ (టీపీఎఫ్) ప్రధాన లక్ష్యం అన్నారు. కరీంనగర్ జిల్లాలోని కనిజ సంపదను ఖరీదైన గుట్టల విధ్వంసం యదేచ్చగా జరుగుతుంది. ఇంత బహిరంగంగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఈ విధంశాన్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆపివేయాలి, ఇసుక క్వారీలను తక్షణమే ఆపివేయాలి అని తెలిపారు.ఆపరేషన్ కు వ్యతిరేకంగా ఆదివాసీలపై జరుగుతున్న హత్యలను అమాయకులైన ఆదివాసులను హత్యలు చేయడం కేంద్ర రాష్ట్ర పారా మిల్ట్రీ డి.ఆర్.జి బలగాలను నిలిపివేయాలి, అని తదితరులు లక్షలాది మిలిటరీ బలగాలను వెంటనే వెనక్కి రప్పించాలని బోగస్ ఎన్కౌంటర్ లను తక్షణమే ఆపివేయాలని భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని ఆదివాసుల హక్కుల మరణాన్ని వెంటనే ఆపేయాలని మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్చలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తూరు ఇంద్రసేన పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి గడ్డం సంజీవ్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి పాపన్న గౌడ్ హాజరయ్యారు.ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా (టీ పి ఎఫ్) నూతన కమిటీని ఎన్నిక చేశారు. అధ్యక్షులుగా ఆరెల్లి మల్ల గౌడ్ ప్రధాన కార్యదర్శిగా ఆయిందాల అంజన్న ఉపాధ్యక్షులుగా అలుగువెల్లి మల్లారెడ్డి కార్యవర్గ సభ్యులు గా చేరాలు సహాయ కార్యదర్శి చుక్కల శ్రీనివాస్ దేవునూరి రవి లను ఎన్నుకున్నారు.