జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నందు నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి నరసింహులు అధ్యక్షతన ఇన్చార్జ్ జడ్జిగా ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జ్ నందిని ధర్మవరం కి బదిలీ అయిన సందర్భంగా మరియు ప్రస్తుత ఇన్చార్జ్ జూనియర్ సివిల్ జడ్జి భార్గవి ఇరువురికి బార్ ఆసోసియేషన్ సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గొబ్బిళ్ళ సుబ్బరామయ్య జాయింట్ సెక్రెటరీ నాయన పల్లి అనుదీప్ జయసింహ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హస్తవరం ఆనంద్ కుమార్ లేడీ రిప్రజెంటేటివ్ మాడపురి నళిని సయ్యద్ మహమ్మద్ అలీ కొప్పాల సుబ్రహ్మణ్యం పసుపులేటి శ్రీకర్ పనతల రాబిన్సన్ పాల్గొన్నారు.