ఉగ్రవాదు చర్యను ఖండించిన ప్రజా సంఘాలు
జనం న్యూస్ 26 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : జమ్మూ కాశ్మీర్లో పహళ్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులను తీవ్రంగా ఖండిస్తూ భీమారం మండలం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గాంలో 26 మంది పర్యాటకులను పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న లస్కర్ తోయిబా సంస్థ ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా పెట్టుకుని అతి కిరాతకంగా కాల్చి చంపడం దారుణమైన చర్యని భారతదేశానికి ప్రపంచ దేశాల మద్దతు తెలపడం అభినందనీయమని, ఉగ్రవాదం అణిచివేయడంలో తమ వంతు సహకారం అందిస్తామని ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా ముందుకు వచ్చాయని, ఇది ఉగ్రవాది చర్యలు అణచివేసే దిశగా భారత్ కు శుభ పరిణామని అన్నారు. చర్యలు జరిగిన వెంటనే భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటన రద్దు చేసుకొని హఠాత్తుగా దేశానికి వచ్చి ఉగ్రవాదం అణ చివేయడానికి ఆర్మీ నేవీ రక్షణ శాఖలతో సమావేశం ఏర్పాటు చేసి, వారికి ప్రభుత్వ చర్యలను తెలియజేసి, అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వ విధానాన్ని తెలియజేసి అందరి మద్దతును పొందడం కూడా దేశం అంతా ఒకే మాటపై ఒకే బాటపై ఉంచే విధంగా ప్రధాన మోడీ రక్షణ శాఖ మాత్యులు రాజనాథ్ సింగ్ చర్యలు హర్షనీయమని అన్నారు. హిందువులంతా జరిగిన సంఘటనపై విచారణ వ్యక్తపరిచారని, తీవ్రంగా ఖండించారని హిందూ సమాజం ఐక్యమత్యంగా ఉండి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోవాలని కొవ్వొత్తులతో భారీ నిరసన తెలిపారు