ఎంపీసీ గ్రూపు లో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించిన తుంగూర్ బాలిక
జనం న్యూస్ ఎప్రిల్ 26 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన బాలిక మంగళ వారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. వివరాల్లోకి వెళితే తుంగూరు గ్రామానికి చెందిన కొల్లూరి ప్రభాకర్ జయ దంపతుల చిన్న కూతురు కొల్లూరి ప్రణతి కరీంనగర్ లోనీ ట్రినిటీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్లో చదువుతుంది. ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు 994 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిందని ప్రణతి తల్లిదండ్రులు తెలియజేశారు. మారూముల గ్రామానికి చెందిన ప్రణతి ఉత్తమ ఫలితాలు సాధించడంతో గ్రామస్తులు అభినందించారు. ప్రణతి తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తమ కూతురు చదువుల్లో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేదని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిందని తెలిపారు. ప్రణతి మాట్లాడుతూ ఇంజనీరింగ్ లో ఉన్నత చదువులు చదివి మంచి ఇంజనీర్ గా ఎదిగి ఉన్నత స్థాయిలో నిలబడాలన్నది తన లక్ష్యమని మంచి ఉద్యోగం సాధించి ఇంత గొప్పగా చదివించడానికి కష్టపడుతున్న తన తల్లిదండ్రులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని తాను ఒక ఆడపిల్లలా కాకుండా ఏది కావాలంటే అది కోరుకున్న చదువు చదవడానికి అనునిత్యం ప్రోత్సహిస్తూ తనకు అండదండగా నిలబడుతున్న తల్లిదండ్రులకు ఎటువంటి కష్టం రాకుండా మంచిగా చూసుకుంటానని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఇంతటి ర్యాంకు రెండవ ర్యాంకు రావడానికి నా యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే సాధ్యమైందని ప్రణతి తెలిపింది.