జనం న్యూస్ ఏప్రిల్ 26 ముమ్మిడివరం ప్రతినిధి : మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లాంచనంగా ప్రారంభించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు .ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వేట నిషేధ కాలంలో చేపల వేట మీద ఆధారపడి జీవించే టుంబాలకు ఇచ్చే భృతి 10 వేల నుంచి 20వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఈ పథకాన్ని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు మరియు జిల్లా మత్స్యశాఖ అధికారి సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మంది మత్స్యకారులకు 258.356 కోట్ల రూపాయలను నేరుగా వారి అకౌంట్లో జమ చేయనున్నారు అని అదే విధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పథకంలో భాగంగా 11,123 లబ్ధిదారుల ఖాతాలోకి సుమారు 22.24 కోట్లు నేరుగా జమ చేయబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో , ఎక్స్ జెడ్పిటిసి మాజీ అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద కూటమి నేతలు కార్యకర్తలు ఉద్యోగులు మీడియా మిత్రులు పాల్గొన్నారు