జనం న్యూస్. ఏప్రిల్ 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలనీ మండల వైస్ ఎంపీపీ పండుగల లక్ష్మి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన హత్నూర గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు, మాయదారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందోనని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ వర్గాల ప్రజలు మోసపోతున్నారని పేర్కొన్నారు.పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ఆత్మగౌరవంతో బ్రతికారని కేసీఆర్ గత పదేళ్ళలో చేసిన అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలన కోరుతున్నారని ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.బీఆర్ఎస్ 25వ.రజతోత్సవ సభ దేశ చరిత్రలోనే పెద్ద సభ అని,బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ఊరూవాడా ఉప్పెనల కదిలి రావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ మహంకాళి నాగేందర్. మాజీ జెడ్పిటిసి ఆశయ్య. పిఎసిఎస్ డైరెక్టర్ గుండ రాములు. మాజీ ఉపసర్పంచ్ మెరాజ్. తాజా మాజీ వార్డు సభ్యులు ఖదీర్. బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చెక్క రవీందర్ గౌడ్. నాయకులు. గొల్ల యాదయ్య. మాణిక్ రెడ్డి. ఖాజా భాయ్. యాదగిరి ముదిరాజ్. నల్లోల్ల ఎల్లయ్య. ఇతర నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.