జనం న్యూస్ ఏప్రిల్ 27 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన సంఘటన మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65 పై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.మునగాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పచ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరి గ్రామానికి చెందిన చేడే యశస్విని (24) హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ తన జీతంతో తండ్రికి బుల్లెట్ బండి గిఫ్ట్ గా కొనుగోలు చేసి తన స్నేహితుడు బడ్డు కొండ అచ్యుతా కుమార్ సహాయంతో హైద్రాబాద్ నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా మునగాల మండలం ఆకుపాముల సమీపంలో రోడ్డు పై పడి ఉన్న గేదె కు బుల్లెట్ బండి తగలగా యశస్విని ఒక్కసారిగా కిందపడిపోవడంతో వెనకనుంచి వస్తున్న లారీ మృతురాలి తలమీదనుంచి వెళ్లడం జరిగింది. మృతురాలి బాబాయ్ చాడ సురేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మునగాల ఎఎస్ఐ దార వెంకటరత్నం తెలిపారు.మునగాల సిఐ రామకృష్ణ రెడ్డి పంచనామ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు.