జనం న్యూస్ 26.ఎప్రిల్. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు జాదవ్ కుమారుడు సాయి చైతన్య సివిల్స్ లో 68వ ర్యాంకు సాధించారు.ఉట్నూర్ లోని సేవాలాల్ మందిరంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క సాయి చైతన్యకు,ఆయన తల్లిదండ్రులకు శాలువాలతో సన్మానించారు.సాయి చైతన్య ఐఏఎస్ కు ఎంపిక కావడం ఎంతో సంతోషకరమని,గిరిజన బిడ్డ ర్యాంక్ సాధించడం గర్వంగా ఉందని సుగుణక్క అన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు పట్టుదలతో సాయి చైతన్య లాగా కృషి చేస్తే ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో రాణించవచ్చని ఆమె పేర్కొన్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ సునీల్, సిరికొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షైక్ ఇమామ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇమామ్, గోవింద్ తదితరులు ఉన్నారు. ఆత్రం సుగుణక్క క్యాంపు కార్యాలయం, ఉట్నూర్