జనం న్యూస్ ఏప్రిల్ 27 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో రైతు వేదిక సభలో రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం పై కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణలో ధరణి స్థానంలో భూ భారతి 2025 చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని రైతులకు న్యాయమైన సేవలు అందుతాయని తమ భూములకు సంబంధించిన సమస్యలను పై దరఖాస్తు చేసుకునే సౌకర్యము ఉన్నదని నిషేధిత భూములు సాదా బైనామాల క్రమబద్ధీకరణ పేర్లు మార్పులు సవరణ సర్వే నంబర్లు పొరపాట్లు సమస్యలను ఎం ఆర్ ఓ దృష్టికి తేవాలన్నారు. సమస్య అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్ డీ ఓ దగ్గరికి తీసుకురావాలన్నారు. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని భూ సమస్యలు నిర్ణీత కాల పరిమితంలో పరిష్కారం అవుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి వో, ఎం పీ డీ వో, ఎం ఆర్ ఓ, బిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సుతారి రమేష్, భూమా గౌడ్, సలీం, మహేష్, రవి, రమేష్, పలువురు రైతులు పాల్గొన్నారు.