జనం న్యూస్- ఏప్రిల్ 26- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ - నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో వేసవి ప్రత్యేక కరాటే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలకు ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని, మానసికంగా దృఢంగా ఉండటానికి దోహదపడుతుందని,శారీరక మానసిక దృఢత్వానికి కరాటే ఉపయోగపడుతుందని అన్నారు, కరాటే మాస్టర్ వెంకట్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు 25- 4 - 2025 నుండి 5- 6 - 2025 వరకు సాయంత్రం 5:00 నుంచి 6:30 వరకు స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఆవరణలో నిర్వహిస్తున్నామని శిక్షణ పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు, కరాటే శిక్షణ తరగతులను ప్రారంభించడానికి విచ్చేసిన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ కు స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపాల్ ఏ శివకుమార్ కరస్పాండెంట్, నకులరావులు జ్ఞాపికను బహుకరించారు, ఈ కార్యక్రమంలోప్రిన్సిపాల్ ఏ శివకుమార్, కరస్పాండెంట్ నకులరావు ,ఉపాధ్యాయులు ప్రేమ్ చంద్, ప్రియాంక, సంతోషి, సంయోజిత, అనూష, విద్యార్థులు పాల్గొన్నారు.