జనం న్యూస్ ఏప్రిల్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ నినాదమైన ప్రత్యేక రాష్ట్ర సాధనను ప్రపంచ నలుమూలల చాటి చెప్పి దేశ పాలకులను మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీ ఆర్ ఎస్ జెండా బీ ఆర్ ఎస్ రజతోత్సవ పండుగకు ఉవ్వెత్తున తరలి రండి.బి ఆర్ యస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీష్ అరోరా పిలుపునిచ్చారు. తెలంగాణ జాతి పిత కేసిఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనను సుసాధ్యం చేసి దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది షహభాష్ అనిపించేలా దశాబ్ద కాలంపాటు పాలించిన కేసిఆర్ నాయకత్వానికి మద్దతుగా మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో తరలి రండ తెలంగాణ రాష్ట్ర ప్రజల వరంగల్ ఎల్కతుర్తి వద్ద జరిగే భారీ బహిరంగ రజతోత్సవ సభ కు కూకట్పల్లి నియోజకవర్గం నుండి అన్ని డివిజన్ల లోని అన్ని కాలనీలు బస్తీల నుంచి బస్సులు కార్లలో వేలాదిగా తరలిరావాలని బి ఆర్ యస్ పార్టీ కూకట్ పల్లి నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీష్ అరోరా పిలుపునిచ్చారు.