సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 27 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం స్మశాన వాటిక దారి 9 ఫీట్ల రోడ్డు విషయమై ఈనెల 22వ తేదీన జమ్మికుంట పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సిలివేరు శ్రీకాంత్ హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు తో పాటు జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు లను మర్యాదపూర్వకంగా కలిసి స్మశాన వాటిక రోడ్డు కబ్జా విషయమై గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కబ్జా గురైన భూమిలో బోర్డును పాతడం జరిగింది. ఇట్టి బోర్డును కబ్జాదారుడు తొలగించి, అక్రమంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేపట్టాడు,ఇట్టి విషయంపై సామాజిక కార్యకర్త సిలువేరు శ్రీకాంత్ హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు తో పాటు జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు లను కబ్జా గురైన స్థలానికి తీసుకువచ్చి విచారణ చేపట్టడం జరిగింది. జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబు కబ్జాకు గురైన రోడ్డును నక్ష తెప్పించి,స్మశాన వాటికకు పాత రోడ్డును ఎలాగైతే ఉందో రోడ్డును పునర్దరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఇట్టి విషయంపై సామాజిక కార్యకర్త సిల్వర్ శ్రీకాంత్ మాట్లాడుతూ..ఇట్టి రోడ్డుకు సంబంధించిన సర్వే నంబర్స్ 793/ఏ/2,793/బి కొందరు రాజకీయ నాయకుల అండదండలు కబ్జాదారుడికి ఉండడంతో ఇట్టి స్మశాన వాటిక రోడ్డు విషయమై రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి రెవిన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని అన్నారు. ఇట్టి విషయమై రెండు మూడు రోజుల్లో కబ్జా గురైన స్మశాన వాటిక రోడ్డు మరియు అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను తొలగించి తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేపట్టకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఈ సందర్భంగా సిలివేరు శ్రీకాంత్ తెలిపారు.