హెడ్ కానిస్టేబుల్ పండరి,
జనం న్యూస్, ఏప్రిల్ 28,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో సోమవారం హెడ్ కానిస్టేబుల్ పండరి, పోలీస్ సిబ్బందితో కలిసి ప్రజలకు సైబర్ క్రైమ్ నేరగాళ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ అపరిచితుల ఫోన్ కాల్స్,మెసేజెస్లతో ఓటిపి అడిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటిపి చెప్పకూడదని అన్నారు. ఒకవేళ ఓటిపి చెప్పినట్లయితే మీ సెల్ ఫోన్ హ్యాంగ్ చేసి, మీ వివరాలన్నీ తెలియకుండానే సేకరించి, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కాల్ చేస్తే అవకాశం ఉంటుందని అన్నారు.మీకు ల్యాటరీ తగిలిందని, మీరు రిజిస్ట్రేషన్ చార్జెస్ కొరకు పదివేల రూపాయలు పంపించినట్లయితే మీకు లాటరీ తగిలిన డబ్బులను మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు చెప్పినట్లయితే అసలు నమ్మకూడదని అన్నారు. వెంటనే పోలీస్ స్టేషన్లోని పోలీసులకు సంప్రదించాలని తెలిపారు.సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.