జనం న్యూస్, ఏప్రిల్ 29, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి
రామగుండం జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న రామగుండం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ను సరెండర్ చేస్తున్నట్లు రామగుండం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ రామగుండం ఆసుపత్రి పరిశీలన సందర్భంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆసుపత్రిలో ఎం.ఐ.సి.యూ వార్డు పేషంట్లతో దురుసుగా ప్రవర్తిస్తూ వైద్య వృత్తికే అవమానకరంగా వ్యవహరించడం ఆసుపత్రిలో రోగులకు జరిగే సేవలకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించడం పట్ల జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. రోగులతో కూడా దురుసుగా ప్రవర్తిస్తారని అనేక ఫిర్యాదుల ఉన్నాయని, ఎటువంటి సమాచారం అందించకుండా రెండు రోజుల పాటు విధులకు గైర్హాజరు అయ్యారని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ ను సరేండర్ చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామగుండం జనరల్ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ బి.చంద్రశేఖర్ ను ప్రజా ఆరోగ్యం కుటుంబ సంక్షేమం సంచాలకులకు సరెండర్ చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.