శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి సంస్థాన సంచాలితము
జనం న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి నలబది రెండవ వార్షికోత్సవములు జరుగుతున్నాయి తేదీ 19 ఆదివారము నుండి 21 మంగళవారం వరకు అమ్మవారి ఉత్సవాలు కొనసాగుతాయి శ్రీ చాముండేశ్వరి దేవికి మహా చండి కల్పక్త విధానంతో లోక కళ్యాణార్థం మెదక్ జిల్లా చిటుకుల గ్రామ సమీపమున వెలిసియున్న శ్రీ చాముండేశ్వరి దేవికి స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర పుష్య బహుళ షష్టి ఆదివారము నుండి బహుళ సప్తమి మంగళవారం వరకు త్రాహిణిక దీక్షతో కలశస్థాపనది మహా హోమాంతము జరుపబడును మొదటి రోజు అమ్మవారికి అభిషేకము మరియు 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గణపతి పూజ స్వస్తివాచనము అఖండ దీపారాధన కలశ స్థాపన రుత్వి వరణము మరియు అరణి మదన పూర్వక చితగ్ని ప్రతిష్ట గురు గణపతి మహాచండి వనదుర్గ భగలాముఖి మహావరాహి భువనేశ్వరి మహాబల మహాకుండలిని మృత సంజీవని కాల సంకర్షిణి అన్నపూర్ణ కాల శక్తి ప్రాణశక్తి జీవశక్యది మూల మంత్రానుష్టానములు జరుపబడును మరియు మహాచండి పారాయణం మహా విద్య పారాయణం మహాశక్తిన్యాస పారాయణము చాముండేశ్వరి సహస్రాక్షర మంత్ర మాల పారాయణం దేవి సబ్థాష్టమాల పారాయణం విపరీత ప్రత్యంగిరా మంత్రమాల పారాయణం దేవి రష్మి మాల పారాయణం మధ్యాహ్నము మూడు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మహా చండి హవనము మహా పూజ మహా నివేదన హారతి తీర్థ ప్రసాద వినియోగము కార్యక్రమములుజరుపబడును ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొనగలరని మనవి మహా జనులెల్లరు ఈమహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి లోక ఇతార్థమై ప్రతి ఒక్కరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి