సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు
జనం న్యూస్, ఏప్రిల్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మంగళవారం నాడు అడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంక,కి ముత్యాల తలంబ్రాలు, సీతారాముల శేష వస్త్రాలు అందించారు. ఈ సందర్బంగా జడ్జి,మాట్లాడుతూ ఆ భద్రాచల రామయ్యనే ఈ తలంబ్రాల రూపకంగా మా ఇంటికి భద్రాచల రామయ్య వచ్చారని సంతోషిస్తున్నానన్నారు. తలంబ్రాలు అందరికీ అందించాలనే రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం అన్నారు.