జనం న్యూస్,ఏప్రిల్ 30,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఈరోజు ఆర్జీ త్రి ఏరియాలోని ఓసిపి టు లో ఐన్టియుసి పిట్ సెక్రటరీ రామిండ్ల మనోహర్, మహిళా పిట్ సెక్రెటరీలు తిలక్ ప్రియా, రంజాబి ల ఆధ్వర్యంలోమహిళా కార్మికులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ త్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోట రవీందర్ రెడ్డి విచ్చేశారు. మహిళా కార్మికులతో మైన్ లో ఉన్న సమస్యలు, పని ప్రదేశంలో వారి భద్రతకు సంబంధించినటువంటి విషయాలు చర్చించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు , యూనియన్ సెక్రటరీ జనరల్ , మినిమం వెజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో మహిళా కార్మికుల సంక్షేమం పెద్దపీట వేసేది ఐఎన్టిసి మాత్రమేనని, మహిళా కార్మికులు పని చేసుకోవడానికి అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఏదైనా సమస్య ఉంటే తక్షణమే మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే యజమాన్యంతో మాట్లాడి పరిష్కరించి అన్ని రకాలుగా అండగా నిలబడతామని తెలిపారు. సమావేశంలో మహిళ కార్మికులు చెప్పిన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన యజమాన్యంతో మాట్లాడి తొందరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ రామిండ్ల మనోహర్ మహిళా పిట్ సెక్రెటరీ తిలక్ ప్రియా రంజాబి, చందన, అనూష,రజిత,జ్యోతి మరియు ఇతర మహిళా కార్మిక సోదరీమణులు పాల్గొనడం జరిగింది.