దస్తావేజు లేఖర్లు నిరసన కార్యక్రమం.
ఈ మార్పుతో మా జీవన ఉపాధి కోల్పోయింది. మమ్మల్ని గుర్తించండి..
కొత్తగూడెం సబ్ రిజిస్టర్ జోన్ ప్రజానీకం.
జనం న్యూస్ కొత్తగూడెం ఆర్ సి ఏప్రిల్ 29
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చుంచుపల్లి మండల కేంద్రంలోని. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం నందు. ఈరోజు దస్తావేజు లేఖర్లు నిరసన కార్యక్రమం చేపట్టినారు. ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ జోన్ నందు నివాసముంటున్న అనేక కుటుంబాలు తమ సొంత ఇంటిని నిర్మించుకొని సంబంధిత మున్సిపాలిటీ గ్రామపంచాయతీ అధికారుల్ని డోర్ నెంబర్లు మరియు అసైన్మెంట్ నెంబర్‌తో నమోదు చేయించుకున్నారు, కొన్ని సందర్భాలలో వీరు అధికారిక స్థల పట్టాలు లేకుండానే నివాసాలు నిర్మించుకొని గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ తరహా స్థలాలు మరియు నివాస గృహాలు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా సంబందించిన సరైన చట్టబద్ధత ఏర్పడుతుంది. భవిష్యత్తులో వారసత్వం కొనుగోలు అమ్మకము లాంటి వ్యవహారాలు విరివిగా. జరుగుతున్నాయి, అంతే ప్రస్తుతం మున్సిపాలిటీ గ్రామపంచాయతీ జారీచేసిన అసైన్మెంట్ నెంబర్ ఆధారంగా మీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి, దీని వలన ప్రజలు తమ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోలేక భవిష్యత్తులతో హక్కులను రుజువు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబ సభ్యుల మధ్య లేదా సంబంధిత భాగస్వామ్యంలో భూతగాధలకు. సానుకూలంగా జరగాలని అందరూ కోరుతున్నారు. ఏజెన్సీ ఆధారిత కొన్నిచోట్ల నమోదు చేయకూడదన్న ఆంక్షలు వలన ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి, దీని వలన కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఆస్తి విషయంలో వివాదాలు. ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితిలన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సులభంగా చట్టబద్ధంగా వారి ఆస్తులను నమోదు చేసుకుని అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఇట్టి అసైన్మెంట్ నెంబర్లు ఆధారంగా రిజిస్ట్రేషన్లు మరియు ఏజెన్సీ తో చట్టపరంగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని మీ అధికారిక పరిధిలో ఉన్న నిబంధన ప్రకారం దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా,మేము కోరుచున్నాము. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ జోన్ ప్రజలతో ఎంతోమంది తమ ఆస్తుల పట్ల అంకిత భావంతో కూడిన నమ్మకాన్ని పొందగలుగుతున్నాయి, ఇది వారి భవిష్యత్తు తరాలను కూడా మేలు కోరి ఒక శుభకార్యం అవుతుంది. కావున ఈ అంశాన్ని పరిగణం లో తీసుకొని ఇంటి అసైన్మెంట్ నెంబర్లు ఆధారంగా రిజిస్ట్రేషన్లు మరియు ఏజెన్సీ అథారిటీగా అనుమతినిచ్చే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయాలను కోరుచున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో. దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు.