జనం న్యూస్: 30 ఎప్రిల్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
శ్రీశ్రీ గా పేరుపొందిన శ్రీరంగం శ్రీనివాసరావు ప్రకృతిలోని ప్రతి అంశం పైన రచనలు చేసి సామాజిక స్పృహలు పెంపొందించిన శ్రీశ్రీ సాహిత్యం మరువలేనిదని బాల సాహిత్య రచయితలు ఉండ్రాళ్ళ రాజేశం, కోణం పర్శరాములు అన్నారు. ఏప్రిల్ 30 శ్రీశ్రీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీ శ్రీ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం కలం ద్వారా సమాజ చైతన్యం తెచ్చిన మహాకవి అన్నారు. బాలల కోసం కూడా ఆలోచనత్మకమైన రచనలు చేసి, చైతన్య బీజాలు నాటాడని, నేటి రచయితలు కూడా సమాజంలో ప్రతి అంశం పైన వినూత్నమైన సాహిత్యం అందించాలన్నారు.