జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
139 మేడే రోజున వాడవాడలా సిపిఐ, ఏఐటీయూసీ జెండాలు ఎగురవేసి కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించాలి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని, చికాగోలో జరిగిన కార్మిక లోకం రక్తతర్పణం చేసి కేవలం తమ దేశపు కార్మికవర్గానికే కాకుండా ప్రపంచ కార్మిక లోకానికికంతటికీ కొత్త వెలుగును అందించిన రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ మేడే ను కార్మిక లోకం అంత ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ కార్మికులకి విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ఉదయం వి.టి. అగ్రహారం దగ్గర ఫ్లోర్ మిల్లు వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ప్రచార గోడపత్రిక విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుగత అశోక్ కార్మికులతో మాట్లాడుతూ ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయనీ. ఈ వెట్టి చాకిరీ మేం చేయలేమని, మాకు ఈ బానిసత్వం వెట్టి చాకిరీ నుంచి విముక్తి కావాలని కార్మికలోకమంతా ఏకమై పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం మిలిటెంట్ పోరాటాలు నడుపుతూ ఆ పోరాటంలో చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం అని గుర్తు చేశారు. రోజుకి 24 గంటలలో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి (రెస్టు), మిగిలిన 8 గంటలు రిక్రీయేషన్ కోసం లాంటి అనేక హక్కులు ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారని తెలిపారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు అని అన్నారు. యాంత్రికయుగం రాకముందు మనిషి గంటలకొద్దీ పనిచేసేవాడన్నారు. అదొక బానిస బతుకు ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడన్నారు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయన్నారు. మన భారత దేశంలో 1920 అక్టోబర్ 31 లో ఏఐటీయూసీ మొట్ట మొదటి కేంద్ర కార్మిక సంఘంగా ఆవిర్భావం జరిగిన నాటి నుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైందని అప్పటినుండి అసంఘటితరంగ కార్మికవర్గం అన్ని రంగాల్లోకి వచ్చిందన్నారు. 1991 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటితరంగ కార్మికవర్గం కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదని ముఖ్యంగా ఐ.టి.రంగంలో ఎంతోమంది మహిళలు, యువకులు పనిచేస్తున్నానీ అన్నారు. నేటి మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం వుంటే అక్కడ కంపెనీలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంత వరకు శ్రమదోపిడీ జరుగుతుంది కాబట్టి మేడే స్ఫూర్తితో శ్రమాదోపిడికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని అన్నారు. అందుకనే గత ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్లును తీసుకు వచ్చి కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలకవర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి స్వాగతిస్తున్నాయిని అసంఘటితరంగంలో అయితే సరేసరి అని ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టి ఔట్ సోర్సింగ్‌లోను కార్మిక చట్టాల నియమాలు అమలులో లేవని పేర్కొన్నారు. సెక్యూరిటీ వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్టు ఉద్యోగులే అధికం అని అంతే కాకుండా ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుందిని నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని వాళ్ళచే 10,12 గంటలు పనిచేయిస్తున్నారని అశోక్ తెలిపారు..ఇది విద్యా, వైద్య రంగాల్లో ప్రయివేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది కాబట్టి శ్రమదోపిడీ కూడా పెరుగుతుంది. ప్రపంచీకరణ వలన వంద సంవత్సరాల క్రితం సాధించిన కనీస డిమాండ్లు కూడా ఈనాటికి అమలుకు నోచుకోవడంలేదన్నారు. ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారులు, బహుళజాతి కంపెనీలు శ్రామిక దోపిడీకి, కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంఘటితమవుతున్న ఈ తరుణంలోనే ప్రపంచ కార్మికవర్గం ఆ శక్తులను ప్రతిఘటించేందుకు ఉత్సాహంతో పోరాడాలన్నారు. అన్ని రంగాల్లో ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను, స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆటో, టాటా మేజిక్, మ్యాక్సి క్యాబ్, ట్యాక్సీ మొదలైన వాహనాలు పై ఇన్స్యూరెన్స్, రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, లేబర్ ట్యాక్స్, టోల్ గేట్ల ఫీజుల పై 30 % శాతం తగ్గించాలని, అసంఘటితరంగంలో ఉన్న లోడింగ్, అన్లోడింగ్, హమాలీ కార్మికులకు, కాల్ గ్యాస్ డెలివరి బాయ్స్ కి, ఆటో డ్రైవర్లు, మోటారురంగ కార్మికులకి పి. ఎఫ్, ఈ. ఎస్. ఐ, పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, గ్రామ,వార్డు సచివాలయం వాలంటీర్లను కొనసాగించాలి, బకాయిలు చెల్లించాలని మొదలైన డిమాండ్ల సాధన కోసం కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం ఇదేనని అశోక్ తెలిపారు. అందుకే కార్మిక అమరవీరులను స్మరించుకుంటూ 139 వ మేడే జయప్రదం కోసం కర్మికలోకమంతా కృషి చేయాలని బుగత అశోక్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సమితి నాయకులు బూర వాసు మరియు కార్మికులు పాల్గొన్నారు.