జనం న్యూస్ ఏప్రిల్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
అల్లాపూర్ డివిజన్ పర్వత నగర్ రెండవ పేస్ లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముత్యాల పోచమ్మ అమ్మ వారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈసందర్భంగా ఆలయంలో గత మూడు రోజులుగా వేద బ్రాహ్మణులు హోమాలు, వివిధ క్రతువులు నిర్వహించారు ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్, కృష్ణ రాజపుత్, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.