జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గత నెల మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కాగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. నేటి రోజున పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించారు. పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి భావోద్వేగానికి గురికాకుండా , చెడుగా ఆలోచనలు ఆలోచించకుండా మరల రీవాల్యుయేషన్ కానీ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలి.అనుకున్న ఉన్నత చదువులకు ,విజయలకై విద్యార్థులు నిరంతరం శ్రమించాలి. ఫెయిల్ అనేది విజయానికి ఒక గుణపాఠంగా భావించి విద్యార్థులు అధైర్య పడకుండా
ఉండాలి అని కొత్తగట్టు సింగారం గ్రామ నివాసి పెంబర్తి వినయ్ ఒక్క ప్రకటనలో తెలియజేశారు….