జనం న్యూస్, మే 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు కుమార్
జగదేవపూర్ : వివాహానికి మానవతా దృక్పథంతో పుస్తే మట్టెలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్న వట్టిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యాధర్ బుధవారం మండలం లోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కొమ్మాట కలవ్వ నర్సింలు దంపతుల కుమార్తె వివాహానికి స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యాధర్
మానవతా దృక్పథంతో వారి చేతుల మీదుగా పూస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకుంటూ మలో ఒక్కడిగా ఉంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తు, అన్న అంటే నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటున్న ఏకైక నాయకులు మా గ్రామ ముద్దు బిడ్డ విద్యాధర్ అని గ్రామ ప్రజలు కొనియాడారు.
ఈ సంధర్బంగా విద్యాధర్ మాట్లాడుతూ గ్రామం లో ప్రతి అడ బిడ్డలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారికి అండగా ఉంటానని చెప్పారు. గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామ ప్రజలకు ఇప్పుడు అండగా ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా చేపడుతున్నట్లు చెప్పారు.నేను సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని తెలిపారు.గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాలు చేయడం నా కర్తవ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రజితరాజేందర్రెడ్డి, నాయకులు వెంకట్రామిరెడ్డి,విద్యాధర్, సత్యనారాయణ,సాయిబాబా,అశోక్,నర్సింహులు,దుర్గయ్య,శ్రీనివాస్,ఎల్లయ్య,సుధాకర్,మల్లయ్య,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.