ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
అచ్యుతాపురం(జనం న్యూస్):తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పులపర్తి,చూచుకొండ, గణపర్తి గ్రామాల్లో ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే కూడు, గూడు, నీడ నినాదంతో పార్టీని అధికారంలో తీసుకురావడంతోపాటు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించే పాలన చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి,బిజెపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు మహిళలు పాల్గొన్నారు.