అచ్యుతాపురం(జనం న్యూస్): మండల కేంద్రంలో దొరికిన బ్యాగును జంగలూరు గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ రాజు పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. ఆ బ్యాగును పోలీస్ స్టేషన్లో సీఐ గణేష్ కి అప్పగించాడు.
బ్యాగు కోసం విచారణ జరపగా అప్పికొండ గ్రామానికి చెందిన మైలపల్లి భారతి తన కుటుంబంతో వస్తుండగా పూడిమడక రోడ్లో ఆమె యొక్క బ్యాగు పొరపాటున పడిపోయిందని చెప్పడంతో సదరు బ్యాగు పోగొట్టుకున్న మహిళను విచారించి ఆ బ్యాగులో రూ.1750 నగదు, 1 తులం బంగారు గొలుసు అందించినట్లు సీఐ తెలిపారు. పోలీసస్టేషన్కు వచ్చి నిజాయితీగా బ్యాగును అందజేసిన రాజుకి రూ.500 పారితోషకంగా అందించి సీఐ అభినందించారు.