జనం న్యూస్ మే 01:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బండి సృజన్ వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర కో- ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానలా మెహన్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారితో పాటు వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి , బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేం గంగా ప్రసాద్,ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి,జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ భూమా రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రాము,మోర్తాడ్ మండల ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు నిరజ్ గా , ఏర్గట్ల మండల మైనారిటీ అధ్యక్షులు మునీర్ , తాళ్లరాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు దిబ్బ శ్రీనివాస్, రమేష్ , తదితరులు పాల్గొన్నారు.