జనం న్యూస్ 19 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
హజరత్ సయ్యద్ డెంఖేషావలీ బాబా రహమతుల్లా అలైహి 308వ ఉరుసు ఉత్సవాలలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు పాల్గొన్నారు. ఈనెల 17వ తేదీన పవిత్ర ఖురాన్ పఠనంతో ప్రారంభమైన ఉత్సవాలు 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగుతాయి. శనివారం సాయంత్రం జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవ నిర్వాహకులు ఖాదీమ్ షేక్ బహదూర్ (ఛోటా), షేక్ షాజహాన్, సిద్ధిక్ తదితరులు అవనాపు విక్రమ్ గారిని సాదరంగా ఆహ్వానించి, పూజలు నిర్వహించారు. అనంతరం ఖాధీమ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ గారు మాట్లాడుతూ శాంతి, సమానత్వంతో నిండిన సమాజం నెలకొనే దిశగా బాబా కృషి చేశారన్నారు. బాబా ఆశీస్సులతో సమాజం శాంతియుతంగా ఉండి అభివృద్ధి పదంలో సాగాలని, అందరికీ శుభం జరగాలని విక్రమ్ గారు ఆకాంక్షించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని విక్రమ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, జనసేన నాయుకులు షేక్ మారేష్, ఎన్నింటి నరసింగరావు, ముని లక్ష్మణ, సంపత్ ఖాదర్ పాల్గొన్నారు