జనం న్యూస్ మే 3 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మునగపాక మండలం మునగపాక గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సహకారంతో మహిళల సంరక్షణే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించడం లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఎలమంచిలి నియోజవర్గ అభివృద్ధిలో భాగంగా పలు ప్రాంతాల్లో కుట్టు మిషన్ శిక్షణ టైలరింగ్ కేంద్రాలను ఆ యొక్క గ్రామ నాయకులతో ప్రారంభించడం జరిగినది. మహిళలందరికీ వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మెరుగుపరచడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కుట్టు మిషన్ కేంద్రాలలో 90 రోజులు పాటు శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కుట్టుమిషన్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదిరులు పాల్గొన్నారు.