ఏపి స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), గిద్దలూరు టౌన్, జనవరి 19 (జనం న్యూస్):
కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి శనివారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఒంగోలు లోని కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర పురం మండలంలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మెమొరాండాన్ని కలెక్టర్ కు అందజేశారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లుగా ఎమ్మెల్యే వెల్లడించారు.