జనం న్యూస్ మే 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీయూడబ్ల్యూజే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికలు రామచంద్రపురంలో జరిగాయి. జిల్లా అధ్యక్షునిగా ఎం ఎన్ వి ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా కాట్రేనికోనకు చెందిన పిఎస్ నాయుడు ఎన్నికయ్యారు. యూనియన్ సభ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు యూనియన్ పెద్దల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నాయుడు తెలిపారు.