జనం న్యూస్ 20 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్ ) ఆలేరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం రోజున సైనిక్ గ్రూప్ ద్వారా స్థానిక ఎస్ హెచ్ ఓ రజనీకర్ చేతుల మీదుగా పేద విద్యార్థులకు ఆర్మీ బిఎస్ఎఫ్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా s.i రజనీకర్ మాట్లాడుతూ విద్యార్థులకు పలు సలహాలు,సూచనలు ఇస్తూ బాగా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలి ఇంకొందరికి చేయుతగా,ఆదర్శంగా నిలవాలి అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సైనిక గ్రూప్ ఫౌండర్స్ మరియు కానిస్టేబుల్ బండారి ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫైజల్, ఎస్సై విజయ ఏ ఎస్ ఐ ఆంజనేయులు, జహంగీర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు