వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్.
జనం న్యూస్ మే 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ మండలం అనుకోడ గ్రామంలో అడవి ప్రాంతంలో జరుగుచున్న ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీలతో మాట్లాడి సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ వేసవికాలం కావడం నేల గట్టిగా ఉండడంతో గడ్డపారకు పారకు భూమి తెగకపోవడంతో అధికారులు పెట్టిన కొలతల ప్రకారం చేయలేకపోతున్నారని కూలి గిట్టుబాటు కావడంలేదని అన్నారు గ్రామంలో అధికారులు పనులు చూపకపోవడంతో కూలీల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు ఫోటో యాప్ వలన గంటల తరబడి ఎర్రటి ఎండలో వేచి చూడాల్సి వస్తుందని ఎండంత కూలీల మీదనే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మండుటెండలో కూలీలు అడవి ప్రాంతానికి వెళ్లి పనిచేస్తున్నారని రవాణా చార్జీలు ఇవ్వడం లేదని విమర్శించారు ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొలతలు తగ్గించి పనులను చేపట్టాలని రోజు కూలి 600 రూపాయలు ఇచ్చి ఉపాధి పని దినాలను 200 రోజులకు పెంచాలని అలాగే ఉపాధి కూలీలకు ప్రమాద బీమా 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వారం వారం పే స్లిప్పులు ఇచ్చి వేతనాలు ఇవ్వాలని పనిముట్లు పార గడ్డపార తట్ట బుట్టలు ఇవ్వాలని పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు సరిపడా టెంటూ, మంచినీటి సౌకర్యం మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉపాధి కూలీలతో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు .