ఆర్ సిఎస్ రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా కమిటీ
( జనం న్యూస్ మే 6 చంటి)
నిన్న సాయంత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ మండలాల్లో రాళ్ళతో కూడిన వడగళ్ళ వర్షం మూలంగా చాలా మంది రైతులు నష్టపోయారని రైతు కూలీ సంఘo ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బోనాల స్వామి కార్యదర్శి సూరంపల్లి మహేందర్ లు ఉమ్మడి మెదక్ జిల్లా లో వివిధ గ్రామాలు తిరుగుతూ పంట నష్టపోయిన రైతుల పొలాల్లో తిరుగుతూ అడిగి తెలుసుకోవడం జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో తిరిగి పరిశీలిస్తూ కొనుగోలు వేగవంతం చేయాలని వడ్లు ఎండిన శాతం(మ్యాచర్ )పేరిట రైతులను ఇబ్బందికి గురి చేయరాదని అన్నారు , వడగండ్ల వర్షం మూలంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారాన్ని సకాలంలో తొందరగా అందజేస్తూ, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి తొందరగా నివేదిక అందజేయాలని కోరుతూ నష్ట పోయిన రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సహాయం చేయాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు ప్రజా సంఘాల నాయకులు బాలన్న తో పాటుగా వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.