జనం న్యూస్,జనవరి 20,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని విజయ డైరీ బిఎంసియు ముందు తమ పాల పెండింగ్ బిల్లులను అందజేయాలని పాడి రైతులు ఆదివారం బీఎంసీయు ముందు నిరసన,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రధాన కూడలిలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో విజయ డైరీ మేనేజ్మెంట్ పది పదిహేను రోజులకి పాల బిల్లులను చెల్లించే వారని ప్రస్తుతం నెలలు గడుస్తున్న పాల బిల్లులను చెల్లించకపోవడం విడ్డూరమని అన్నారు. కంగ్టి మండల పరిధిలోని రైతన్నలు వర్షాధార పంటల పైనే ఆధారపడి ఉంటారని అటువంటి రైతన్నలకు ఎంతో కష్టంగా గేదెలను పోషించి పాలను విజయ డైరీ కి పోసినందుకు సకాలంలో బిల్లులు అందక అప్పుల ఊబిలో కోరుకుపోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే నాలుగు బిల్లులు పెండింగ్లో ఉన్నందుకు పాల కొనుగోలు చేసే ప్రసక్తి లేదని అన్నారు. గ్రామాలలో పాలను సేకరించే అధ్యక్షులు లబోదిబో అంటున్నారు. పాలు పోసే ప్రతి రైతన్న మా పాల పైసలు చెల్లించాలని ప్రతినిత్యము గొడవలు చేస్తున్నారని తడ్కల్ బిఎంసియు పరిధిలో సుమారుగా 30 లక్షల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పాలు పోసే రైతన్నలకు సమాధానం ఇయ్యలేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పాడి రైతులకు దాన బ్యాగుల ధరలను పెంచడం జరిగిందని అన్నారు.గతంలో ₹ 800 రూపాయలు ఉన్న దాన బ్యాగు ధర ₹ 1200 వందల రూపాయలకు పెంచడం జరిగింది.పాలు పోసిన రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో తరచుగా ఇంటిముందు గొడవలకు దిగుతున్నారని అన్నారు.ఇప్పటికే వారి మాటలు భరించలేక అప్పులు చేసి తీర్చినప్పటికీ బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు.పలుమార్లు తెలంగాణ విజయ డైరీ ఎండి,డిప్యూటీ డైరెక్టర్,ను కలిసినప్పటికీ స్పందించకపోవడం విడ్డూరమని అన్నారు. గ్రామాలలో విజయ డైరీ పాలను సేకరించే వారిని సకాలంలో పెండింగ్ లోని బిల్లులు చెల్లించి ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజయ డైరీ నిర్వాహకులకు డిమాండ్ చేస్తున్నారు. సకాలంలో పాల బిల్లులు చెల్లించని యెడల గ్రామాలలో పాల సేకరణ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా విజయ డైరీ నిర్వాహకులు ప్రభుత్వ అధికారులు సత్వరమే పెండింగ్లో ఉన్న బిల్లులను అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జంమ్గి బి దత్తు రావు,తడ్కల్ రమేష్ గౌడ్,ముబారక్ పూర్ అజయ్,చాప్ట బి సంగప్ప,సుక్కలతీర్త్ బాలాజీ పాటిల్, గరిడేగావ్ దతు రావు, పొట్పల్లి వెంకట్ రెడ్డి, భీమ్రా లక్ష్మణ్,రైతులు జ్ఞానేశ్వర్,బాగయ్య, లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.