జనం న్యూస్ మే 6 మెదక్ జిల్లా వివిధ మండలాలలో
ఉపాధి హామీ పనులు చేసే వేతనదారులకు పనిముట్లు లేకపోవడంతో కూలీలపై అదనపు భారం పడుతుంది. 15 సమాచారాలు కిందటి వరకు ఉపాధి హామీకి సంబంధించిన పనిముట్లును ప్రభుత్వమే అందించేది. కానీ గత కొన్నేళ్ల క్రితం కేంద్రం ప్రభుత్వం ఎన్ఒసి అనే సాఫ్ట్వేర్ తీసుకొచ్చినప్పటి నుండి ఈ ఉపాధిహామీకి సంబంధించిన పనిముట్లను పూర్తిగా ఇవ్వడం మర్చిపోయారు. దీంతో ఎవరికి వారే సొంతంగా పనిముట్లును కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని నిమిత్తం రూ.200 నుంచి రూ.300 వరకు అదనపు భారము పడుతుందని ఉపాధి కూలీలు వాపోతున్నారు. ఉపాధి హామీ నిబంధనల చట్టం ప్రకారం కూలీలకు 60శాతం పనిముట్లు, 40 శాతం పాలనా ఖర్చుల కింద ఆరు శాతం మించకుండా చూసుకోవాలి. పరిపాలనకు వెచ్చించే నిధులు కింద ఉపాధి హామీ పనిముట్లు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. గత 15 సమాచారాలు నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ పనిముట్లు కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించకపోవడంతో ఉపాధి హామీ సామగ్రిని కొనుగోలు చేసే అవకాశం లేకుండాపోయింది. గతంలో ఉపాధి కూలీలకు పలుగు, పార, తట్ట, నీడ కోసం టెంట్లు, తాగడానికి మంచినీళ్లు, మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు సరఫరా చేసేవారు.ఫిబ్రవరి నుండి మే వరకు వేసవి అలవెన్స్ కింద 60 శాతం అదనం అలవెన్స్‌ను ఇచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇవన్నీ వేతనదారుల చట్టం కల్పించిన హక్కులను పొందలేక అదనపు భారంతో, పనిచేసిన సమయానికి వేతనం అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మండలంలో లేబర్ గ్రూపులకు వేసవి నిమిత్తం టెంట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలియజేశారు. ఉపాధి పనులు వేసవిలో జరగడంతో చాలామంది ఈ ఎండ వేడికి సొమ్మసిల్లిన పరిస్థితులు చాలా ఎక్కువ. ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు