జనంన్యూస్. 07. సిరికొండ. ప్రతినిధి.
సి పి ఐ మాస్ లైన్ ( ప్రజా పంథా ) మండల నాయకులు మల్కి లింబన్న పిలుపు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా. గాడ్కోల్ గ్రామంలో అల్లూరి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
లింబన్న మాట్లాడుతూ మన్యం ప్రజల హక్కుల కోసం. దేశాన్ని బ్రిటిష్ బానిస సంకెళ్ల నుండి, విముక్తి చేయటానికి, మన్యం యువకులను వీరులుగా తయారు చేసి, బ్రిటిష్ వారికి కునుకు లేకుండా చేశాడు.
చింతపల్లి రంపచోడవరం పోలీస్ స్టేషన్ల పై దాడి చేసి, ఆయుధాలను తీసుకెళ్లి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అని ఆయన అన్నారు.ద్రోహి ఇచ్చిన సమాచారం తో బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజును పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారు.27 సంవత్సరాలకె అల్లూరి అమరుడయ్యాడు, ఆ వీరుని చరిత్ర,త్యాగం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను గంజాయి మద్యం మత్తుకు బానిసలుగా చేసి పేడదారి పట్టిస్తున్నారు. మతాన్ని యువత మెదల్లలో చొప్పొంచి,మొద్దు బారే విధంగా తయారు చేశారు అని ఆయన అన్నారు.యువత మత్తు మతం నుండి బయటకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నా మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉద్యోగ సాధన కోసం పోరాటంలో ముందు వరసలొ ఉండాలని ఆయన పిలుపునిచ్చారు…ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా నాయకులు నారా గౌడ్, పి.రమేష్ కూలి సంఘం నాయకులు బి కిషోర్, ఎస్ కిషోర్, ఎండి అనీష్ మల్కి ప్రదీప్ పాల్గొన్నారు.