జనం న్యూస్ మే 07(నడిగూడెం)
పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపురి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. బుధవారం నడిగూడెం కే ఎల్ ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరపత్రాలు బ్యానర్ లను ఆవిష్కరించి మాట్లాడారు. మార్చి 2025 ఇంటర్ ఫలితాల్లో నడిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయ మన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రిన్సిపాల్ , అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. ప్రభుత్వ కళాశాలలో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఇంటర్లో ప్రవేశం పొందాలని కోరారు. మొదటిసారి కళాశాలకు విచ్చేసిన చైర్పర్సన్ ను ప్రిన్సిపల్ డి.విజయ నాయక్ అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ నాయక్ అధ్యాపకులు జాన్ పాషా ,శ్రీధర్ ,మహేష్, కృష్ణ, వీరన్న, వెంకటేశ్వరరావు నాగరాజు, ఉపేందర్ ,మదర్ కొల్లు శ్రీనివాస్ , ధనుంజయ రవి వర్మ, మనీ, నాగరాజు పాల్గొన్నారు.