జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 8
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు ఎస్ సి కాలనీలో నిన్న రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి పులుకూరి యోహాను రేకుల ఇల్లు ఈదురు గాలి ప్రభావానికి లేచిపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కుటుంబ విషయాన్నీ కాలనీ వాసులు తర్లుపాడు మండల జనసేన నాయకులు వెలుగు కాశీరావు దృష్టికి తీసుకు రాగ వెంటనే స్పందించి వారికి రేకులు భిగించి ఆధనంగ 10వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని పులుకూరి ఆదాము కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కొండెబోయిన సునీల్, గంజరపల్లి మహేష్, గుంటు మోషే, షేక్ కరీముల్లా,గడ్డం బాలరాజు వన్నెబోయిన వెంకటేశ్వర్లు,టిడిపి నాయకులు జాన్ బనియన్ తదితరులు పాల్గొన్నారు