జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 8 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఏప్రిల్ నెలలో 30వ తేదీన జరిగిన కౌన్సిల్ తీర్మానం ఐటెం నెంబర్ 9 లో విచిత్ర విన్యాసాలు..
పసుమూరు గ్రామ సర్వేనెంబర్ 750/c 754/a 753/e మరియు 753/f నెంబర్ గల అనధికార లేఔట్లలో భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 నందు పొందుపరిచిన విధంగా అనధికార లేఔట్లలో ఇల్లు కట్టుకొనుటకు ప్లాన్లు మంజూరు చేయవలసిందిగా కోరుతూ తీర్మానం చేయడం జరిగింది. ఇందులో ఒక విచిత్ర సంఘటన ఏమిటంటే ప్లాట్లు కొన్న యజమానులకు అవి అనాధికార లేఔట్లని తెలియక కొన్నారు అని ఉదాహరించినారు. కౌన్సిల్ తీర్మానం ఏప్రిల్ 30వ తారీకు నా తీర్మానం జరిగితే మరి 754 /a సర్వే నెంబర్ లో ఈరోజు అనగా ఆరు ఐదు 2025వ తారీఖున కూడా సిమెంటు రోడ్లు వేస్తా ఉన్నారు మరి ఇందులో ప్లాట్లు కొనేవారికి ఇది అనధికారాలు లే అవుట్ తెలియకపోవడం ఎంత విచిత్రమో గమనించాలని పుర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విషయంలో ఈరోజు రోడ్లు వేస్తున్న దానికి గతంలో ఎప్పుడో కొన్నాము అని ప్లాట్లు యజమానులు మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్ని లక్షల రూపాయలు ముట్టజెప్పి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారో ప్రజలు గమనించాలని తెలియజేస్తా ఉన్నాం. అనధికార లేఔట్ లో ప్లాన్లు మంజూరు చేయవద్దు అని జీవో నెంబర్ 20 తయారుచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నారా లోకేష్ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఎన్నో చోట్ల మీటింగులు పెట్టి అనధికార లేఔట్ లో ప్లాట్లు కొనవద్దని చెబుతున్న కూడా చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది రూల్స్ అతిక్రమించి లంచాలకు కక్కుర్తి పడి జీవోలను తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న శైలి పై ఈరోజు డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారికి కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రెటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కాపీలు పంపించడం జరిగింది. ఈ విషయంపై వెంటనే ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఈ ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది. వీటిపై వెంటనే తగు చర్యలు తీసుకొని పక్షంలో ఇది ప్రజా ఉద్యమంగా అలాగే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మల్లెల శివ నాగేశ్వరరావు తెలియజేశారు