మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని సూచన
జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
జిల్లా ప్రజలు, యువత గంజాయి మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐపీఎస్ ఈ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులలో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలు అయినట్లయితే వారి యొక్క వివరాలను ఈ నెంబర్ 8712670551 కు ఫోన్ చేసి తెలియజేయాలని తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలకు బానిస అయినట్లయితే వారిని డి అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి మత్తు పదార్థాలను మానిపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. గంజాయి మరియు ఇతర నిషేధితమత్తు పదార్థాలు పెంచిన, స్వీకరించిన, రవాణా చేసిన వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. మాదక ద్రవ్యాలను అరికట్టడం లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని, గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకొంటుందని దాని వలన వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారని, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని, గంజాయి రహిత జిల్లా కోసం అధికారులు, సిబ్బంది కృషి చేయాలనీ ఎస్పీ సూచించారు.