జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమనేపల్లి మండలం డబ్బా చౌరస్తాలో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 12 వ తేదిన మంత్రి సీతక్క చే ఆవిష్కరణ జరగనున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ * ఆవిష్కరణ కార్యక్రమ పోస్టర్ లను విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క పర్యటనను ప్రతి ఒక్కరూ విజయవంతం చెయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సీడం గణపతి,ఆదివాసీ సంఘాల నాయకులు పురం నారాయణ కుమ్మరం నందనం,ఆత్రం సురేష్,కొమరం రాజయ్య,కొమరం దినేష్,ఆలం వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.