జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా హైదరాబాదులో జరుగుతున్న అందాల పోటీలు విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ..దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక రకమైన యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఉండడం కారణంగా పరిస్థితులు సమీక్షించుకుని అందాల పోటీలు నిర్వహించడం పై ప్రభుత్వం నిర్ణయించుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు.ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా దేశానికి అండగా నిలబడాలని ..సైనికులకు, వారి కుటుంబాలకు మేమున్నామన్న ధైర్యాన్ని కల్పించే సంకల్పం వారి ముందు ఉంచేలా చూడాలని… ఈ విధంగానే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి కానీ ఇటువంటి అందాల పోటీలు నిర్వహించడం కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ చూపకుండా పరిస్థితులు అన్వేషించుకుని ముందుకు వెళ్లాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి సూచించారు…