జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 10 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వారి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు తెలిపారు.బీసీ సంక్షేమ శాఖ మంత్రి యస్. సవితా రూ.5 లక్షలు అందజేశారని పేర్కొన్నారు.వారికి గిరిజన సంఘం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. భారతదేశం గర్వించదగ్గ వీరుడుగా వీరమరణం మురళి నాయక్ పొందారు. అతి చిన్న వయసులోనే మరణించడం బాధాకరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో సర్దార్ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాగా ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్, కౌన్సిలర్ వి. కోటా నాయక్, చెన్నకేశవుల రాంబాబు, ఇస్లావతు మంగ నాయక్,యం. వెంకటేష్ నాయక్, పుట్టా వెంకట బుల్లోడు, చందవరం హరి ప్రసాద్,సలికి నీడి నాగరాజు, గోపి నాయక్,