జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :రాజాంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి 30 అర్జీలను ఆయన స్వీకరించారు. అర్జీ రూపంలో వచ్చిన ప్రతి సమస్య త్వరగా పూర్తయ్యే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.