విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,
జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబులుగా పని చేస్తూ, రైలు నుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ఇటీవల మరణించిన కొత్తవలస కానిస్టేబులు కీ.శే.లు బి.రామకోటి సతీమణి శ్రీమతి రమ కు “చేయూత”ను
అందించేందుకు పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన రూ.1,48,300/- ల చెక్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మే 9న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కొంత మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత” గా అందజేయడంఅభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.ఈ కార్యక్రమంలో డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, వెల్ఫేర్ ఆర్ఎస్ఐ వర ప్రసాద్, మరణించిన పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.