జనం న్యూస్. మే 9. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) అంచలంచలుగా ఎదుగుతూ అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉంటూపార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందిన యువ నాయకుడు నాగ ప్రభు గౌడ్ రెండవసారి బీజేపీ పార్టీ హత్నూర మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తూ. శుక్రవారం మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు,ఈ సందర్భంగా హత్నూర మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నాగ ప్రభు గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రెండవసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. మరింత బాధ్యతగా భావించి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు,మరోసారి మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఎమ్మెల్సీ గోదావరి అంజిరెడ్డికి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్, రఘువీరారెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో. సీనియర్ నాయకులు. బిట్ల మహేష్. చంద్ర గౌడ్. రాజేష్. కుమార్. హనుమంతు. రామ్ రెడ్డి. నాగేష్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.