జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కెపిహెచ్బి డివిజన్ సీనియర్ బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ఆనరోగ్య సమస్యలతో బాధపడు చికిత్స నిమిత్తం గౌతమ్ న్యూరో హాస్పిటల్లో చేరారు, స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కెపిహెచ్బి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ ప్రీతం రెడ్డి తో కలిసి, గౌతమ్ న్యూరో హాస్పిటల్ ను సందర్శించి శ్రీనివాస్ రెడ్డి ని పరామర్శించడం జరిగింది, నిత్యం చురుగ్గ పార్టీ కార్యక్రమలలో పాల్గొంటూ చలాకీగా ఉండే శ్రీనివాస్ రెడ్డి నీ రాజేశ్వరరావు చూసి చెల్లించి పోయారు, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక పోవడంవలన ఇబ్బందికరమైన పరిస్థితులలో సరైన చికిత్సను చేయించలేకపోతున్నాము అని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కి తెలియజేయగా, శ్రీనివాస్ రెడ్డి కి మెరువైన వైద్యం అందించి త్వరగా కోలుకునే విధంగా చూడాలని ఆసుపత్రిలోని డాక్టర్లకు రాజేశ్వరరావు సూచించి ఆర్థిక సహాయం అందించారు.