జనం న్యూస్ :10 మే శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ :వైశాఖ శుద్ధ త్రయోదశి నరసింహ జయంతిని పురస్కరించుకొని, శనివారం రోజున సిద్దిపేట పట్టణంలోని శ్రీ ఉమా పార్థివ కోటి లింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా పూజలు ఈ రోజు ఉదయం 10 గంటల 40 నిమిషాలకు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి దివ్య దర్శనం పొందుతూ, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడిన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నిర్వాహకులు తెలిపారు. స్వామి వారి కృపతో సమస్త భక్తులకు శాంతి, ఐశ్వర్యాలు కలుగజేయాలని ఆశించారు.